నాగారం డివిజన్ 5లో బీజేపీ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు
నాగారం | సెప్టెంబర్ 26, 2026
నాగారం డివిజన్ 5లో బీజేపీ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను నిర్వహించారు. జూపల్లి నరేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి నాగారం మున్సిపల్ మాజీ చైర్మన్ కౌకుంట్ల చంద్రారెడ్డి, డివిజన్ అధ్యక్షుడు నాగరాజ్ యాదవ్, మాజీ కౌన్సిలర్ శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని స్మరించుకున్న నాయకులు
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరీ విముక్తి కోసం పోరాడిన వీరవనిత చాకలి ఐలమ్మ అని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల పోరాట పటిమకు ఆమె ప్రతీకగా నిలిచారని కొనియాడారు. కులం ఆధారంగా ఎవరినీ తక్కువగా చూడకూడదనే సందేశానికి ఐలమ్మ జీవితం నిదర్శనమని తెలిపారు.
కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ నాయకులు
ఈ కార్యక్రమంలో బీజేపీ ప్రధాన కార్యదర్శులు పోతంశెట్టి వెంకటేశ్వరరావు, మామిడి జంగారెడ్డి, సీనియర్ నాయకులు తడిసిన సూర్యశేఖర్ రెడ్డి, మాధవరావు, వల్లాల శ్రీనివాస్, సురేందర్ రెడ్డి, వెంకటాచారి, మధుగౌడ్, షాజీ, జలీల్‌తో పాటు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ వార్తను షేర్ చేయండి
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.