తాడ్వాయి: తాడ్వాయి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (KGBV) పాఠశాలకు రూ.20 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు పనులు పూర్తయ్యాయి. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ ప్రత్యేక చొరవతో ఈ పనులు చేపట్టినట్లు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం తెలిపింది.
ఈ సీసీ రోడ్డు పనులు పూర్తికావడంతో పాఠశాలకు వచ్చే విద్యార్థినులకు, సిబ్బందికి రాకపోకలు సులభతరం అయ్యాయి.
డౌన్‌లోడ్న్యూస్ పేపర్ క్లిప్పింగ్ • హై క్వాలిటీ

















