కొంపల్లిలో హిల్టన్ టొబాకో కార్మికుల సమావేశం.. సమస్యలపై చర్చ

కొంపల్లి డివిజన్ పరిధిలోని హిల్టన్ టొబాకో కంపెనీ బీఎంఎస్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కార్మికులు, ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై చర్చించారు.

హిల్టన్ టొబాకో కంపెనీని కొత్తూరు సమీపంలోని మేకగూడ గ్రామ శివారు ప్రాంతానికి బదిలీ చేసే ప్రక్రియ నేపథ్యంలో కార్మికులు, ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను సమావేశంలో వివరించినట్లు నిర్వాహకులు తెలిపారు.

కార్మికుల సమస్యలపై చర్చ

ఈ సందర్భంగా కొంపల్లి డివిజన్ బీజేపీ అధ్యక్షుడు పెద్దబుద్ధుల సతీష్ సాగర్ మాట్లాడుతూ కార్మికులు, ఉద్యోగులు ఎదుర్కొంటున్న న్యాయమైన సమస్యల పరిష్కారానికి తమ పార్టీ తరఫున అందుబాటులో ఉంటామని తెలిపారు.

కార్మికుల సమస్యలపై అవసరమైన సహకారం అందిస్తామని ఆయన పేర్కొన్నారు.

ఈ సమావేశంలో బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కౌన్సిల్ సభ్యుడు జనార్ధన్ రెడ్డి, బీఎంఎస్ నాయకులు సంపత్, ఉమేష్ తదితరులు పాల్గొన్నారు.

🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్ ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా

133.33 గజాల స్థలం అమ్మకానికి!

📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్ ✓ నివాసానికి అనుకూలం ✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త

మా తాజా వార్తలను మిస్ కాకండి!

తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.

Yaswanth Pavahar
Yaswanth Pavahar పవార్ వార్త • సైట్ అడ్మిన్ Journalist and Executive Editor at Telangana Pawar Dainapatrika, focused on responsible journalism, public-interest reporting, and highlighting local issues across Telangana.

Leave a Reply