కొంపల్లిలో బీజేపీ ఆధ్వర్యంలో గాంధీజీ జయంతి వేడుకలు
మహాత్మా గాంధీజీ జయంతిని పురస్కరించుకుని కొంపల్లిలో బీజేపీ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్, మేడ్చల్ అర్బన్ జిల్లా అధ్యక్షులు గిరివర్ధన్ రెడ్డి, రాష్ట్ర నాయకులు డా. ఎస్. మల్లారెడ్డి, మూగ జయశ్రీ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
కార్యక్రమంలో భాగంగా గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులను ఈటల రాజేందర్ శాలువాతో సన్మానించారు.
ప్రభుత్వ పాఠశాలలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం
రాష్ట్ర పార్టీ సూచన మేరకు కొంపల్లి ప్రభుత్వ పాఠశాలలో స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. గాంధీజీ ఆశయాలే స్ఫూర్తిగా ప్రధాని మోదీ స్వచ్ఛ భారత్‌కు పిలుపునిచ్చారని తెలిపారు. పరిశుభ్రత, సేవాభావం, సామాజిక బాధ్యతను ప్రతి ఒక్కరూ ఆచరించాలని పేర్కొన్నారు.
పారిశుద్ధ్య కార్మికుల సమస్యలపై ఆరా
పారిశుద్ధ్య కార్మికులు తమ ఉద్యోగ, దైనందిన జీవితంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఈటల రాజేందర్ అడిగి తెలుసుకున్నారు. వారి స్థితిగతులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మంచి మార్పులు వచ్చేలా కృషి చేస్తానని తెలిపారు.
పాల్గొన్న బీజేపీ నాయకులు, స్థానికులు
ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు ఆదిరెడ్డి రాజిరెడ్డి, జిల్లా ఓబీసీ మోర్చా నాయకుడు శేఖర్ యాదవ్, జిల్లా నాయకులు శివాజీ రాజు, శంకర్ నాయక్, బహదూర్పల్లి డివిజన్ అధ్యక్షులు శ్రీనివాస్, కొంపల్లి బీజేవైఎం అధ్యక్షుడు మహేందర్ సాగర్ పాల్గొన్నారు.
స్థానిక నాయకులు మాధురి, మధు, మహేశ్వర్ రెడ్డి, ఆకుల శ్రీనివాస్, శ్రీనివాస్, తిరుపతి, నరసింహ, శ్రీకాంత్, అశ్విన్, శేఖర్, దేవిక, లక్ష్మణ్, భీమ, సందీప్, రాజేష్, మహేశ్, శ్రీకాంత్ గౌడ్, వాసు, సాయి ముదిరాజ్, మురళీకృష్ణ తదితర బీజేపీ నాయకులు, స్థానికులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
– పెద్దబుద్ధుల సతీష్ సాగర్
కొంపల్లి డివిజన్ అధ్యక్షులు, బీజేపీ
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.