భాష / भाषा / Language:

కుత్బుల్లాపూర్‌లో సద్భావన ర్యాలీ.. విద్యార్థులతో కలిసి పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్

విద్యార్థులతో కలిసి సద్భావన ర్యాలీలో పాల్గొన్న కూన శ్రీశైలం గౌడ్
తాజా వార్త
కుత్బుల్లాపూర్‌లో సద్భావన ర్యాలీ • విద్యార్థులతో కలిసి పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ • రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా కార్యక్రమం
కుత్బుల్లాపూర్

విద్యార్థులతో కలిసి సద్భావన ర్యాలీలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్

రాజీవ్ గాంధీ జయంతిని పురస్కరించుకుని ఐడీపీఎల్ చౌరస్తా వద్ద నిర్వహించిన సద్భావన ర్యాలీలో మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

📍 ఐడీపీఎల్ చౌరస్తా
👨‍🎓 2,000+ విద్యార్థులు
🇮🇳 సద్భావన ర్యాలీ
🏆 విద్యార్థులకు బహుమతులు
సద్భావన ర్యాలీలో కూన శ్రీశైలం గౌడ్
విద్యార్థులతో సద్భావన ర్యాలీ
📸 కార్యక్రమ దృశ్యాలు
SPECIAL REPORT
విద్యార్థులతో కలిసి సద్భావన ర్యాలీలో కూన శ్రీశైలం గౌడ్
👨‍🎓

2,000 పైచిలుకు విద్యార్థులు

వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థుల భాగస్వామ్యం

🇮🇳

రాజీవ్ గాంధీ జయంతి

జయంతిని పురస్కరించుకుని సద్భావన ర్యాలీ

💻

టెక్నాలజీపై ప్రస్తావన

టెలికమ్యూనికేషన్, కంప్యూటర్ టెక్నాలజీపై వ్యాఖ్యలు

🏆

విద్యార్థులకు బహుమతులు

వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సత్కారం

కార్యక్రమానికి సంబంధించిన వివరాలు

కుత్బుల్లాపూర్: మాజీ ప్రధాని భారతరత్న రాజీవ్ గాంధీ జయంతిని పురస్కరించుకుని గిరి నగర్ డివిజన్‌కు చెందిన కట్టే శ్రీకాంత్ యాదవ్ ఆధ్వర్యంలో ఐడీపీఎల్ చౌరస్తా వద్ద సద్భావన ర్యాలీ నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ పాల్గొన్నారు. విద్యార్థులతో కలిసి ర్యాలీలో పాల్గొన్న ఆయన అనంతరం వారిని ఉద్దేశించి ప్రసంగించారు.

“

మాజీ ప్రధాని భారతరత్న రాజీవ్ గాంధీ జయంతిని పురస్కరించుకుని వివిధ పాఠశాలలకు చెందిన దాదాపు రెండు వేల పైచిలుకు మంది విద్యార్థిని విద్యార్థులతో నిర్వహించిన సద్భావన ర్యాలీలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని కూన శ్రీశైలం గౌడ్ తెలిపారు.

— కూన శ్రీశైలం గౌడ్, మాజీ ఎమ్మెల్యే

దేశ అభివృద్ధికి రాజీవ్ గాంధీ అనేక సంస్కరణలు తీసుకువచ్చారని, ముఖ్యంగా టెలికమ్యూనికేషన్, కంప్యూటర్ టెక్నాలజీ వంటి ఆధునిక రంగాలకు ప్రాధాన్యతనిస్తూ భారతదేశాన్ని సాంకేతికంగా ముందుకు తీసుకెళ్లేందుకు విశేష కృషి చేశారని ఆయన పేర్కొన్నారు.

అదేవిధంగా 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులకు ఓటు హక్కు కల్పించిన ఘనత రాజీవ్ గాంధీకి దక్కుతుందని శ్రీశైలం గౌడ్ అన్నారు. యువత దేశ భవిష్యత్తుకు కీలకమని, వారు సమాజ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని సూచించారు.

అనంతరం వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ బహుమతులను అందజేసి అభినందించారు.

ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించిన శ్రీకాంత్ యాదవ్‌ను శ్రీశైలం గౌడ్ ప్రత్యేకంగా అభినందించారు.

కార్యక్రమంలో పాల్గొన్న వారు

కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ గుప్తా, మాజీ మున్సిపల్ వైస్ ఛైర్మన్ జై రామ్, రాములు, సత్యనారాయణ, మహేష్ గౌడ్, శివప్రసాద్ యాదవ్, రవికుమార్ గుప్తా, ఉప్పల్ రావు, నరేందర్ గుప్తా, తిరుపతిరెడ్డి, శ్రీనివాసచారి, ప్రైవేట్ పాఠశాలల యజమానులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

కుత్బుల్లాపూర్ • సద్భావన ర్యాలీ • ప్రత్యేక వార్తా కథనం
🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్ ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా

133.33 గజాల స్థలం అమ్మకానికి!

📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్ ✓ నివాసానికి అనుకూలం ✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త

మా తాజా వార్తలను మిస్ కాకండి!

తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.

Yaswanth Pavahar
Yaswanth Pavahar పవార్ వార్త • సైట్ అడ్మిన్ Journalist and Executive Editor at Telangana Pawar Dainapatrika, focused on responsible journalism, public-interest reporting, and highlighting local issues across Telangana.

Leave a Reply