అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన బీఆర్‌ఎస్‌ సీనియర్ నాయకులు

సికింద్రాబాద్, అక్టోబర్ 15: లాలాపేట్‌లో దేవీ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. లాలాపేట్ మహారాణి నవరాత్రి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో లేబర్ అడ్డా సమీపంలో ఏర్పాటు చేసిన శ్రీ దుర్గామాత మండపంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
ఈ ఉత్సవాల్లో భాగంగా బీఆర్‌ఎస్‌ సీనియర్ నాయకులు సునీల్ ముధిరాజ్, కూరెల్లి నాగరాజ్ గౌడ్, మల్లికార్జున్, రాజలింగం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. మండపానికి విచ్చేసిన నాయకులకు ఉత్సవ కమిటీ నిర్వాహకులు రుద్ర విక్రమ్, రుద్ర విశాల్ స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అర్చకులు వేద మంత్రోచ్చారణలతో ఆశీర్వచనం అందించి శేషవస్త్రాలు, తీర్థప్రసాదాలు అందజేశారు.
ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ నాయకులు మాట్లాడుతూ, జగన్మాత ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్న కమిటీ సభ్యులకు, భక్తులకు అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ ప్రతినిధులు, స్థానిక నాయకులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.

పవార్ వార్త

మా తాజా వార్తలను మిస్ కాకండి!

తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.

0 మంది ఇష్టపడ్డారు
షేర్
డౌన్‌లోడ్న్యూస్ పేపర్ క్లిప్పింగ్ • A4 • హై క్వాలిటీ
A4 కథనం
ఒరిజినల్ ఫోటో

మరిన్ని వార్తలు

Leave a Reply