తెలంగాణ ఉద్యమ అమరవీరులకు కీసర బీఆర్ఎస్ నాయకుల ఘన నివాళి
చినింగని బాల్ రాజ్, రాగుల గణేష్ ఆధ్వర్యంలో దీక్షా దివస్ కార్యక్రమం
పవార్ వార్త, కీసర: తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో అమరులైన వారికి నివాళులర్పిస్తూ కీసర గ్రామంలోని అమరవీరుల స్తూపం వద్ద బీఆర్ఎస్ నాయకులు దీక్షా దివస్ కార్యక్రమం నిర్వహించారు. కీసర గ్రామ బీఆర్ఎస్ అధ్యక్షుడు చినింగని బాల్ రాజ్, ప్రధాన కార్యదర్శి రాగుల గణేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, ఉద్యమకారులు పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన ఉద్యమంలో నాయకులు, కార్యకర్తలు చేసిన పోరాటాలను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ స్తూపం వద్ద నివాళులర్పించారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని కొనసాగించాలని నాయకులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ కీసర మండల అధ్యక్షుడు జలాల్పురం సుధాకర్ రెడ్డి, మాజీ సర్పంచ్ నాయకపు మాధురి వెంకటేష్, ఉద్యమకారులు గుర్రం మల్లారెడ్డి, మోర రవికాంత్ ముదిరాజ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు గుర్రం శ్రీధర్ రెడ్డి, యువజన అధ్యక్షుడు తటాకం భాను శర్మ హాజరయ్యారు.
అలాగే ఆనబోయిన జంగయ్య ముదిరాజ్, బొడుసు రమేష్ యాదవ్, రాగుల రమేష్ ముదిరాజ్, గోరంటి ప్రవీణ్, సుమన్ బన్నీ, రాఘవేందర్ గౌడ్, మెట్టు సతీష్ యాదవ్, మంత్రాల వెంకటేష్, రెడ్డబోయిన మధుకర్, శివరాజ్, తిమ్మాయిపల్లి శ్రీకాంత్, వెంకట్ గౌడ్, రాజలింగం, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.













