దళిత స్పీకర్‌ను అవమానించారంటూ బీఆర్‌ఎస్‌పై కాంగ్రెస్ నిరసన.. లింగంపేట్‌లో భారీ కార్యక్రమం
అసెంబ్లీలో దళిత స్పీకర్‌ను అవమానించేలా బీఆర్‌ఎస్ వ్యవహరించిందని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ లింగంపేట్ మండల కేంద్రంలో నిరసన కార్యక్రమం నిర్వహించింది. ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఆదేశాల మేరకు అంబేద్కర్ చౌరస్తా వద్ద ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
లింగంపేట్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గోకుల్ సాయిరాం యాదవ్ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నిరసనలో పాల్గొన్నారు. అసెంబ్లీలో బీఆర్‌ఎస్ పార్టీ వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో లింగంపేట్ మండలంలోని వివిధ గ్రామాల పార్టీ అధ్యక్షులు, సర్పంచులు, ఉపసర్పంచులు, ఏఎంసీ డైరెక్టర్లు, పీఏసీఎస్ చైర్మన్లు, యువజన కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.