మాచాపూర్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా మాచాపురం సంపత్ గౌడ్ నియామకం
ఎల్లారెడ్డి మండలంలోని మాచాపూర్ గ్రామ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా మాచాపురం సంపత్ గౌడ్‌ను నియమించారు. ఎల్లారెడ్డి నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ ఎదురుగట్ల సంపత్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ నియామకం జరిగినట్లు ఎల్లారెడ్డి మండల పార్టీ అధ్యక్షుడు మర్రి బాలయ్య తెలిపారు.
మాచాపూర్ గ్రామంలో పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లే బాధ్యతను నూతన గ్రామ అధ్యక్షుడికి అప్పగించినట్లు మర్రి బాలయ్య తెలిపారు.
ఈ సందర్భంగా మాచాపురం సంపత్ గౌడ్‌కు పార్టీ నాయకులు అభినందనలు తెలిపారు. గ్రామంలో పార్టీని బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలను కలుపుకొని పనిచేయాలని నాయకులు సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షుడు జైల్ సింగ్, మండల సీనియర్ నాయకులు బాబు, జగన్ రెడ్డి, సర్దార్, ప్రేమ్ సింగ్, సంగయ్య, మొగలయ్య, కె. మల్లన్న తదితరులు పాల్గొన్నారు.