రైల్వే ట్రాక్ పక్కన గంజాయి గుర్తింపు.. కురవి మండలంలో నాటుసారా పట్టివేత

మహబూబాబాద్, కురవిలో ఎక్సైజ్ తనిఖీలు.. గంజాయి, నాటుసారా స్వాధీనం

పవార్ వార్త, మహబూబాబాద్: మహబూబాబాద్‌లోని అనంతారం రోడ్డులో రైల్వే ట్రాక్ పక్కన చెట్ల పొదల్లో 1.4 కిలోల ఎండు గంజాయిని ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కురవి మండలంలోని పలు గ్రామాల్లో నాటుసారాపై నిర్వహించిన దాడుల్లో ఇద్దరు మహిళలు పట్టుబడగా, 10 లీటర్ల నాటుసారాతో పాటు నాటుసారా తయారీకి ఉపయోగించే ముడిసరుకును స్వాధీనం చేసుకున్నారు.

రైల్వే పరిసరాల్లో గంజాయి తనిఖీలు

డిప్యూటీ కమిషనర్ దత్తురాజ్ గౌడ్, అసిస్టెంట్ కమిషనర్ నవీన్ చంద్ర ఆదేశాల మేరకు మహబూబాబాద్ జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి కరంచంద్ పర్యవేక్షణలో మంగళవారం తనిఖీలు నిర్వహించారు. మహబూబాబాద్ రైల్వే స్టేషన్ పరిసరాలు, కురవి గేట్ సమీపంలో గంజాయి రవాణాపై సోదాలు చేపట్టారు.

అనంతారం రోడ్డులో రైల్వే ట్రాక్ పక్కన ఉన్న చెట్ల పొదల్లో 1.4 కిలోల ఎండు గంజాయి గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు.

కురవి మండలంలో నాటుసారాపై దాడులు

కురవి మండలంలోని భాంగ్యా తండా, రాయిని పట్నం, ఇస్లావత్ తండా గ్రామాల్లో నాటుసారా తయారీ, విక్రయాలపై అధికారులు దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఇద్దరు మహిళలు నాటుసారాతో పట్టుబడినట్లు ఎక్సైజ్ శాఖ వెల్లడించింది.

వారి వద్ద నుంచి 10 లీటర్ల నాటుసారా, 50 కిలోల నల్లబెల్లం, 20 కిలోల పటిక స్వాధీనం చేసుకున్నారు. నాటుసారా కేసుల్లో పట్టుబడిన ముగ్గురు వ్యక్తులను కురవి, బయ్యారం తహసీల్దార్ల ఎదుట హాజరుపరిచి బైండోవర్ చేసినట్లు అధికారులు తెలిపారు.

అక్రమ రవాణా, విక్రయాలపై హెచ్చరిక

గంజాయి, నాటుసారా విక్రయించినా, రవాణా చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ సీఐ రాంప్రసాద్ హెచ్చరించారు. ఈ దాడుల్లో ఎస్ఐ శ్రీనివాస్, ట్రైనీ ఎస్ఐ ధనలక్ష్మి, కానిస్టేబుళ్లు నాగరాజు, గోపి, జాన్ పాషా పాల్గొన్నారు.

0 మంది ఇష్టపడ్డారు
షేర్
డౌన్‌లోడ్న్యూస్ పేపర్ క్లిప్పింగ్ • హై క్వాలిటీ

మరిన్ని వార్తలు

వ్యాఖ్యానించండి