నిజాంసాగర్ ప్రాజెక్టును సందర్శించిన మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి
కామారెడ్డి, సెప్టెంబర్ 28: తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి సోమవారం నిజాంసాగర్ ప్రాజెక్టును సందర్శించారు. ప్రాజెక్టు ప్రాంగణంలోని చారిత్రాత్మక గోల్ బంగ్లాపైకి చేరుకొని అక్కడి నుంచి ప్రాజెక్టు రమణీయ దృశ్యాలను, పరిసరాల ప్రకృతి అందాలను తిలకించారు.
నీటి నిల్వలు, ఆయకట్టుకు సరఫరాపై ఆరా
అనంతరం నిజాంసాగర్ ప్రాజెక్టుకు సంబంధించిన పలు అంశాలపై స్థానిక నీటిపారుదల శాఖ అధికారులతో శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు. ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం, ప్రస్తుత నీటిమట్టం, నీటి విడుదల వివరాలతో పాటు ఆయకట్టుకు నీటి సరఫరా గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా అధికారులు ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను ఆయనకు తెలియజేశారు.
పర్యటనలో పాల్గొన్న మీడియా ప్రతినిధులు
ఈ పర్యటనలో మీడియా అకాడమీ కార్యదర్శి వెంకటేశ్వరరావు, ఓఎస్‌డీ రహమాన్, టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు రజినీకాంత్, జిల్లా కార్యదర్శి రాజేష్, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌తో పాటు స్థానిక మండల జర్నలిస్టులు పాల్గొన్నారు.
ఈ వార్తను షేర్ చేయండి
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.