ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో ఇందిరమ్మ ఇళ్లకు భూమిపూజ

ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో ఇందిరమ్మ ఇళ్ల రెండో విడతలో మంజూరైన ఇళ్ల నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్ ఆధ్వర్యంలో మున్సిపాలిటీలోని ఒకటో వార్డులో రెండు ఇళ్లకు భూమిపూజ చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల రెండో విడతలో ఎల్లారెడ్డి మున్సిపాలిటీకి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు కృషితో 98 ఇళ్లు మంజూరయ్యాయని మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్ తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా నిరుపేదల సొంత ఇంటి కల నెరవేరుతోందన్నారు. మంజూరైన ఇళ్లను మంచి నాణ్యతతో నిర్మించుకోవాలని లబ్ధిదారులను కోరారు.

ఇళ్ల మంజూరుకు కృషి చేసిన ఎమ్మెల్యే మదన్ మోహన్ రావుకు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జె. జగ్జీవన్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ మత్తమల ప్రశాంత్ గౌడ్, కౌన్సిలర్లు గాయత్రి శ్యాం, గఫార్, దశరథ్, లక్ష్మీ శంకర్, కో-ఆప్షన్ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు, వార్డు ప్రజలు పాల్గొన్నారు.

ఈ వార్తను షేర్ చేయండి
🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్ ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా

133.33 గజాల స్థలం అమ్మకానికి!

📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్ ✓ నివాసానికి అనుకూలం ✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త

మా తాజా వార్తలను మిస్ కాకండి!

తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.

Yaswanth Pavahar
Yaswanth Pavahar పవార్ వార్త • సైట్ అడ్మిన్ Journalist and Executive Editor at Telangana Pawar Dainapatrika, focused on responsible journalism, public-interest reporting, and highlighting local issues across Telangana.

Leave a Reply