ఎమ్మెల్యే లేఖలకు ట్రాకింగ్ సిస్టమ్ రావాలి: మదన్ మోహన్

ప్రజా సమస్యలు, అభివృద్ధి పనులు, నిధుల మంజూరు తదితర అంశాలపై ఎమ్మెల్యేలు ప్రభుత్వ శాఖలకు అందజేసే లేఖలపై తదుపరి చర్యల వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకునేలా ప్రత్యేక ట్రాకింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ ప్రభుత్వాన్ని కోరారు.

అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశాన్ని ప్రస్తావించిన మదన్ మోహన్ మాట్లాడుతూ.. నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యేలు వివిధ ప్రభుత్వ శాఖలకు లేఖలు అందజేస్తున్నారని తెలిపారు. అయితే ఆ లేఖలు ప్రస్తుతం ఏ శాఖ వద్ద ఉన్నాయి, వాటిపై ఏ స్థాయిలో చర్యలు తీసుకున్నారు, వాటి ప్రస్తుత పరిస్థితి ఏమిటనే వివరాలు తెలుసుకోవడంలో స్పష్టత లేకపోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు.

ప్రతి ఎమ్మెల్యే లేఖకు ప్రత్యేక ట్రాకింగ్ నంబర్ కేటాయించాలని ఆయన కోరారు. ఆ నంబర్ ద్వారా లేఖ ప్రస్తుత స్థితి, సంబంధిత శాఖ తీసుకున్న చర్యలు, పెండింగ్‌లో ఉన్న కారణాలు, తదుపరి కార్యాచరణ వంటి వివరాలను ఆన్‌లైన్‌లో తెలుసుకునే విధంగా వ్యవస్థను రూపొందించాలని సూచించారు.

ఇలాంటి వ్యవస్థ అందుబాటులోకి వస్తే ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలపై స్పష్టమైన సమాచారం అందించడంతో పాటు, సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుని సమస్యల పరిష్కారాన్ని వేగవంతం చేయడానికి అవకాశం ఉంటుందని మదన్ మోహన్ అన్నారు.

ప్రజా సమస్యల పరిష్కారంలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచేందుకు ఈ ట్రాకింగ్ వ్యవస్థ ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు.

ఈ వార్తను షేర్ చేయండి

🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్ ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా

133.33 గజాల స్థలం అమ్మకానికి!

📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్ ✓ నివాసానికి అనుకూలం ✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త

మా తాజా వార్తలను మిస్ కాకండి!

తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.

Yaswanth Pavahar
Yaswanth Pavahar పవార్ వార్త • సైట్ అడ్మిన్ Journalist and Executive Editor at Telangana Pawar Dainapatrika, focused on responsible journalism, public-interest reporting, and highlighting local issues across Telangana.

Leave a Reply