సీఎల్పీ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే మదన్ మోహన్

హైదరాబాద్‌లోని తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (CLP) సమావేశానికి ఎమ్మెల్యే మదన్ మోహన్ హాజరయ్యారు.

సమావేశంలో రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిసి ఎమ్మెల్యే మదన్ మోహన్ పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ పథకాల అమలు, రానున్న అసెంబ్లీ సమావేశాల వ్యూహాలు, ప్రజా సమస్యలపై చేపట్టాల్సిన కార్యాచరణ తదితర అంశాలపై జరిగిన చర్చల్లో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీల అమలు, కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి పార్టీ ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేసినట్లు పేర్కొన్నారు.

తన నియోజకవర్గంలో ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలు ప్రజలకు మరింత చేరువయ్యేలా కృషి చేస్తామని ఎమ్మెల్యే మదన్ మోహన్ తెలిపారు.

ఈ వార్తను షేర్ చేయండి

🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్ ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా

133.33 గజాల స్థలం అమ్మకానికి!

📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్ ✓ నివాసానికి అనుకూలం ✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త

మా తాజా వార్తలను మిస్ కాకండి!

తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.

Yaswanth Pavahar
Yaswanth Pavahar పవార్ వార్త • సైట్ అడ్మిన్ Journalist and Executive Editor at Telangana Pawar Dainapatrika, focused on responsible journalism, public-interest reporting, and highlighting local issues across Telangana.

Leave a Reply