జిల్లాస్థాయి కిసాన్ మేళాలో నాగిరెడ్డిపేట ప్రజాప్రతినిధులు, ఏఈవోలు
జిల్లా వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ఆత్మ సౌజన్యంతో నిర్వహించిన జిల్లాస్థాయి కిసాన్ మేళా-2026లో నాగిరెడ్డిపేట మండలానికి చెందిన ప్రజాప్రతినిధులు, ఏఈవోలు పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని కళాభారతి ఆడిటోరియంలో బుధవారం ఈ కార్యక్రమం నిర్వహించారు.
మెల్లకుంట తండా సర్పంచ్ రామావత్ బాల్య, జలాల్‌పూర్ సర్పంచ్ నిజాంపేట శ్రీనివాస్‌గౌడ్, కాంగ్రెస్ కార్యవర్గ సభ్యుడు జమ్మికుంట జీవరత్నం, కాంగ్రెస్ మండల మైనార్టీ అధ్యక్షుడు, ఆత్మకూర్ క్లస్టర్ ఏఈవో రజిత తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
కిసాన్ మేళాలో వ్యవసాయశాఖ, అనుబంధ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను వారు పరిశీలించారు. రైతులకు ఉపయోగపడే ఆధునిక వ్యవసాయ సాంకేతికత, నాణ్యమైన విత్తనాలు, పంటల సాగు విధానాలు, ఉద్యానవన పంటల సాగు, ఆధునిక పద్ధతులపై వ్యవసాయ నిపుణులు, శాస్త్రవేత్తలు అవగాహన కల్పించారు.
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని పంటల సాగులో అధిక దిగుబడులు సాధించే విధానాలను నిపుణులు వివరించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయశాఖ అధికారి, మండల వ్యవసాయ అధికారులు, ఏఈవోలు, అనుబంధ శాఖల అధికారులు పాల్గొని రైతులకు అవసరమైన సమాచారం, సూచనలు అందించారు.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.