ఏటీఎం చోరీ యత్నంపై కేసు నమోదు: నిజామాబాద్ వన్‌టౌన్ ఎస్‌హెచ్‌ఓ శ్రీనివాస్
అలారం మోగడంతో పరారైన వ్యక్తి.. నిజామాబాద్ దేవి రోడ్డు ఏటీఎంలో ఘటన
ఇవి కూడా చదవండి
పవార్ వార్త, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని దేవి రోడ్డులో ఉన్న ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఏటీఎంలో చోరీకి ప్రయత్నించిన గుర్తుతెలియని వ్యక్తి, అలారం మోగడంతో అక్కడి నుంచి పారిపోయాడు. నవంబర్ 24వ తేదీ మంగళవారం తెల్లవారుజామున సుమారు ఒంటి గంటకు ఈ ఘటన జరిగింది.
సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆ వ్యక్తి ఏటీఎం కేంద్రంలోకి ప్రవేశించాడు. ఏటీఎం తలుపును చేతులతో ధ్వంసం చేసి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించాడు. అదే సమయంలో భద్రతా అలారం మోగడంతో పోలీసులకు సమాచారం అందింది.
వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ సీఐ శ్రీనివాస్ సిబ్బందితో కలిసి వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. అయితే పోలీసులు రావడానికి ముందే ఆ వ్యక్తి పరారయ్యాడు.
ఏటీఎం కేంద్రంలోని సీసీ కెమెరాల్లో అతడి కదలికలు రికార్డయ్యాయి. ఈ ఫుటేజీ ఆధారంగా ఆచూకీ కనుక్కునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. నిజామాబాద్ బస్టాండ్, రైల్వే స్టేషన్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో గాలింపు చేపట్టారు.
ఏటీఎం ఇన్‌చార్జి ఫిర్యాదు చేయడంతో వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. ఆ వ్యక్తిని గుర్తించి పట్టుకునేందుకు గాలింపు కొనసాగుతున్నట్లు వన్‌టౌన్ ఎస్‌హెచ్‌ఓ శ్రీనివాస్ తెలిపారు.














