నిజాంసాగర్‌లో బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్న భోజన కార్యక్రమాల అమలును పరిశీలించిన ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు
జుక్కల్ నియోజకవర్గం నిజాంసాగర్ మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీకి సంబంధించిన గోదాంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్న భోజనం అందించే కార్యక్రమాల అమలులో భాగంగా హరే కృష్ణ మూవ్‌మెంట్ ఛారిటబుల్ ఫౌండేషన్ (HKMCF) ఆధ్వర్యంలో జరుగుతున్న పనులను జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ తోట లక్ష్మీకాంతారావు గారు మరియు కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు శ్రీ ఏలే మల్లికార్జున్ గారు పరిశీలించారు.
ఈ సందర్భంగా కార్యక్రమాల అమలు తీరు, ఆహార తయారీకి సంబంధించిన ఏర్పాట్లు, విద్యార్థులకు నాణ్యమైన మరియు పోషకాహార భోజనం అందించే విధానాలను వారు పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో పిట్లం మార్కెట్ కమిటీ చైర్మన్ చికోటి మనోజ్ కుమార్ గారు, నిజాంసాగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రజా పండరి గారు, సంబంధిత అధికారులు, సిబ్బంది మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నాణ్యమైన పోషకాహారం అందించేందుకు ప్రభుత్వం–HKMCF భాగస్వామ్యంతో చేపడుతున్న కార్యక్రమాల అమలును క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
కొత్త అప్‌డేట్స్ కోసం మా WhatsApp ఛానెల్‌లో జాయిన్ అవ్వండి
WhatsApp ఛానెల్ జాయిన్133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.