మృతుల కుటుంబాలను పరామర్శించిన ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ
కామారెడ్డి, అక్టోబర్ 1: కామారెడ్డి పట్టణంలో ఇటీవల అనారోగ్యంతో, అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందిన వారి కుటుంబాలను తెలంగాణ ప్రభుత్వ సలహాదారు, మాజీ మంత్రి మహమ్మద్ అలీ షబ్బీర్ గురువారం పరామర్శించారు.
కామారెడ్డి పట్టణానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు చిట్టిమెల్ల విష్ణు తల్లి ఇటీవల అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందడంతో ఆయన కుటుంబాన్ని షబ్బీర్ అలీ పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
ఈ ఘటనపై పోలీసులు ప్రత్యేక చొరవ తీసుకుని సమగ్ర దర్యాప్తు చేపట్టి, బాధ్యులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని షబ్బీర్ అలీ కోరారు.
అనంతరం కామారెడ్డి–సిరిసిల్ల రోడ్డులోని క్లాసిక్ ఫంక్షన్ హాల్ యజమాని నవాబు అనారోగ్యంతో మృతి చెందడంతో ఆయన కుటుంబాన్ని కూడా పరామర్శించారు.
అలాగే కామారెడ్డి పట్టణానికి చెందిన మాజీ మున్సిపల్ కౌన్సిలర్ రామ్మోహన్ తల్లి మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులను షబ్బీర్ అలీ ఓదార్చారు. ఈ విషాద సమయంలో వారికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.
కష్టకాలంలో ప్రజలకు అండగా ఉంటా
ఈ సందర్భంగా మహమ్మద్ అలీ షబ్బీర్ మాట్లాడుతూ.. ప్రజలకు కష్టకాలంలో అండగా నిలవడం తన బాధ్యత అని అన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, వారికి భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.