పిట్లం డబుల్ బెడ్‌రూమ్ కాలనీకి కొత్త DTR ట్రాన్స్‌ఫార్మర్
కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలోని డబుల్ బెడ్‌రూమ్ కాలనీకి నూతన DTR ట్రాన్స్‌ఫార్మర్ అందుబాటులోకి వచ్చింది. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు చొరవతో రూ.6.75 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన ఈ ట్రాన్స్‌ఫార్మర్‌ను పిట్లం గ్రామ సర్పంచ్ కుమ్మరి చంద్రశేఖర్ ప్రారంభించారు.
డబుల్ బెడ్‌రూమ్ కాలనీ ప్రజల విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రజల అవసరాలను గుర్తించి మౌలిక వసతుల కల్పనకు ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పిట్లం మండల సీనియర్ నాయకులు రాంరెడ్డి, మోహన్ రెడ్డి, దయానంద, వార్డు సభ్యులు బాలకృష్ణ, మోతి, కృష్ణతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.