సబ్దల్‌పూర్‌లో బీజేపీ ఆధ్వర్యంలో సేవా సంకల్ప్ కార్యక్రమం
ఈ కార్యక్రమంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి జక్కుల అశోక్, గ్రామ కమిటీ అధ్యక్షుడు, వార్డు మెంబర్ బత్తుల సాయికుమార్, 5వ వార్డు నెంబర్ జక్కుల అనిషవ్వతో పాటు జక్కుల గణేష్, చింతల రాజు, బత్తుల గణేష్, వినోద్, ప్రణయ్ తదితర కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి జక్కుల అశోక్ మాట్లాడుతూ.. సమాజంలో ప్రజా సంక్షేమం కోసం అంగన్‌వాడీ టీచర్లు నిరంతరం పనిచేస్తున్నారని తెలిపారు. బాలింతలు, గర్భిణీ స్త్రీలు, పిల్లలకు పౌష్టికాహారం అందించడంలో వారు సేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు.
అంగన్‌వాడీ సిబ్బందిని సన్మానించడం ద్వారా వారు మరింత ఉత్సాహంతో పనిచేయడానికి ప్రోత్సాహం లభిస్తుందని జక్కుల అశోక్ తెలిపారు.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.