రసాయన ఎరువులు తగ్గించాలి: శేరిపురం రైతులకు వ్యవసాయ అధికారి రామారావు సూచన

జీవామృతం ఎలా తయారు చేయాలి? శేరిపురం రైతు వేదికలో క్షేత్రస్థాయి శిక్షణ

పవార్ వార్త, శేరిపురం: శేరిపురం రైతులకు జీవామృతం, ఘనజీవామృతం తయారు చేయడం, వాటిని పంటలకు వాడటం, పిచికారీ చేయడం వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో చూపించారు. గ్రామంలోని రైతు వేదికలో ప్రకృతి వ్యవసాయంపై అవగాహన, శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్ గుగులోత్ భారతి అధ్యక్షత వహించారు.

ప్రకృతి వ్యవసాయంతో భూసారం పెరుగుతుందని మండల వ్యవసాయ అధికారి కావటి రామారావు రైతులకు వివరించారు. పర్యావరణానికి మేలు జరగడంతో పాటు ఆరోగ్యకరమైన పంటలు పండుతాయని చెప్పారు.

రసాయన ఎరువుల వాడకం తగ్గించాలని ఆయన రైతులను కోరారు. వాటికి బదులుగా పాటించాల్సిన పద్ధతులను సూచించారు:

– జీవామృతం
– ఘనజీవామృతం
– నీమాస్త్రం
– దశపర్ణి కషాయం

సమావేశం తర్వాత అధికారులు రైతులతో కలిసి జీవామృతం, ఘనజీవామృతం తయారు చేసి చూపించారు. వాటిని ఎంత మోతాదులో, ఏ విధంగా వాడాలో, పంటపై ఎలా పిచికారీ చేయాలో అక్కడే నేర్పించారు.

కార్యక్రమంలో ఏఈఓ రాజ్యలక్ష్మి, ఇరిగేషన్ ఏఈ భరత్, ఉప సర్పంచ్, రైతులు పాల్గొన్నారు.

1 మంది ఇష్టపడ్డారు
షేర్
డౌన్‌లోడ్న్యూస్ పేపర్ క్లిప్పింగ్ • హై క్వాలిటీ

మరిన్ని వార్తలు

వ్యాఖ్యానించండి