డిసెంబర్ 15 నుంచి ఆశా వర్కర్ల నిరవధిక సమ్మె హెచ్చరిక

ముల్కనూర్ పీహెచ్‌సీ ఎదుట ఆశా వర్కర్ల ఆందోళన

పవార్ వార్త, గార్ల: ఆశా వర్కర్లకు నెలకు రూ.18 వేల ఫిక్స్‌డ్ వేతనం చెల్లించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కందునూరి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించకపోతే డిసెంబర్ 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మె చేపడతామని తెలంగాణ ఆశ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) హెచ్చరించింది.

మంగళవారం ఆశా డే సందర్భంగా గార్ల మండలం ముల్కనూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ) ఎదుట యూనియన్ ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు ఆందోళన నిర్వహించారు. తమ న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరుతూ వైద్య అధికారులకు సమ్మె నోటీసు అందజేశారు.

రూ.18 వేల ఫిక్స్‌డ్ వేతనం డిమాండ్

ఈ సందర్భంగా కందునూరి శ్రీనివాస్ మాట్లాడుతూ ఆశా వర్కర్లు చాలీచాలని వేతనాలతో విధులు నిర్వహిస్తున్నారని అన్నారు. వారికి నెలకు రూ.18 వేల ఫిక్స్‌డ్ వేతనం నిర్ణయించి, ప్రతి నెలా చెల్లించాలని కోరారు. ఆశా వర్కర్లు గర్భిణీలను ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించేలా ప్రోత్సహిస్తూ తల్లి, బిడ్డల ప్రాణాలను కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు.

హామీలు నెరవేర్చాలని విజ్ఞప్తి

గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని శ్రీనివాస్ డిమాండ్ చేశారు. సమస్యలను పరిష్కరించకపోతే డిసెంబర్ 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు.

ఆందోళనలో యూనియన్ ఆశా అధ్యక్షురాలు నమ్మి, కార్యదర్శి పి. రమాదేవి, జిల్లా నాయకులు రమణ, కౌసల్య, ఉమాదేవి, సుజాత, ధర్మి, పుష్ప, ఆశకుమారి, జ్యోతి, నీల, భద్రమ్మ, సోనీ, నిరోషా పాల్గొన్నారు.

0 మంది ఇష్టపడ్డారు
షేర్
డౌన్‌లోడ్న్యూస్ పేపర్ క్లిప్పింగ్ • హై క్వాలిటీ

మరిన్ని వార్తలు

వ్యాఖ్యానించండి