తెలంగాణ అండర్-23 క్రికెట్ జట్టుకు ఎంపికైన రాహుల్ యాదవ్‌కు ఘన సన్మానం
తెలంగాణ స్టేట్ అండర్-23 క్రికెట్ జట్టుకు ఎంపికైన దంగర రాహుల్ యాదవ్‌ను టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా గడ్డం చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, రాహుల్ యాదవ్ తెలంగాణ స్టేట్ అండర్-23 జట్టుకు ఎంపిక కావడం అభినందనీయమని అన్నారు. రాబోయే రోజుల్లో మరింత కష్టపడి ఆడి జాతీయ స్థాయికి ఎంపిక కావాలని, క్రీడా రంగంలో ఉన్నత స్థాయికి ఎదిగి తెలంగాణకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
యువత క్రీడల్లో రాణించేందుకు క్రమశిక్షణ, పట్టుదల, నిరంతర సాధన ఎంతో ముఖ్యమని ఆయన తెలిపారు. రాహుల్ యాదవ్ తన ప్రతిభను మరింతగా మెరుగుపరుచుకుని ఉన్నత స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో క్రికెట్ టీమ్ కెప్టెన్ పృథ్వీరాజ్, కార్తీక్, నరేష్, నవీన్, మనోహర్ యాదవ్, రావుల్ యాదవ్, సాయి పవన్, సంపత్, అబ్దుల్ మాలిక్, ప్రశాంత్, రాజ్ కుమార్, చందు, స్నితిక తదితరులు పాల్గొన్నారు.
కొత్త అప్‌డేట్స్ కోసం మా WhatsApp ఛానెల్‌లో జాయిన్ అవ్వండి
WhatsApp ఛానెల్ జాయిన్133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.