ఉప్పల్ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న డీసీసీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్
బోనాల ఉత్సవాల సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన తోటకూర వజ్రేష్ యాదవ్
ఉప్పల్ మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాల సందర్భంగా ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ మందముల పరమేశ్వర్ రెడ్డి గారి ఆహ్వానం మేరకు, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
బోనాల ఉత్సవాల సందర్భంగా ఆలయానికి విచ్చేసిన ఆయన అమ్మవారికి భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆయనకు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వదించారు.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగను ప్రజలు భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆయన కోరారు.
ఈ సందర్భంగా ఆలయ పరిసరాల్లో భక్తుల సందడి నెలకొంది. అమ్మవారి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. బోనాల ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయ నిర్వాహకులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు.