రెండు నాటు తుపాకులు, 8 బుల్లెట్లు స్వాధీనం
సురేందర్ హత్యకు కుట్ర.. పోలీసులకు చిక్కిన ఐదుగురు
ఇవి కూడా చదవండి
పవార్ వార్త, మల్కాజిగిరి: పాత కక్షల నేపథ్యంలో సురేందర్ అలియాస్ సూరిని హత్య చేసేందుకు కుట్ర పన్నిన ఐదుగురిని ఉప్పల్ పోలీసులు, ఎస్‌ఓటీ ఎల్బీనగర్ బృందం సంయుక్తంగా అరెస్ట్ చేసింది. నిందితుల నుంచి రెండు నాటు తుపాకులు, 8 బుల్లెట్లు, మూడు కత్తులు, వాహనాలు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
శిల్పారామం వెనుక అనుమానితుల పట్టివేత
సోమవారం ఉదయం ఉప్పల్‌లోని శిల్పారామం వెనుక భాగంలో అనుమానాస్పదంగా కనిపించిన ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనిఖీ చేయగా వారి వద్ద అక్రమ ఆయుధాలు ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
రూ.35 వేలకు నాటు తుపాకులు కొనుగోలు
విచారణలో బీహార్‌లోని భాగల్‌పూర్‌కు చెందిన వ్యక్తి నుంచి రూ.35 వేలకు నాటు తుపాకులు, బుల్లెట్లు కొనుగోలు చేసినట్లు వెల్లడైందని పోలీసులు తెలిపారు.
నిందితుల నుంచి రెండు నాటు తుపాకులు, 8 బుల్లెట్లు, మూడు కత్తులు, రెండు ద్విచక్ర వాహనాలు, ఒక ఆటో, నాలుగు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
అక్రమ ఆయుధాలపై కఠిన చర్యలు
ఈ కేసు వివరాలను మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి ఐపీఎస్ మీడియా సమావేశంలో వెల్లడించారు. అక్రమ ఆయుధాలు కలిగి ఉండటం, హత్య కుట్రలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు.

















