పదవీ విరమణ పొందనున్న డీఎల్‌పీఓ సురేందర్‌కు ఎల్లారెడ్డి ఆర్డీఓ కార్యాలయంలో సన్మానం
ఎల్లారెడ్డి, సెప్టెంబర్ 28: ఈ నెలలో పదవీ విరమణ పొందనున్న ఎల్లారెడ్డి డివిజనల్ పంచాయతీ అధికారి (డీఎల్‌పీఓ) సురేందర్‌ను సోమవారం ఎల్లారెడ్డి ఆర్డీఓ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. ఆర్డీఓ ప్రభాకర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా సురేందర్ సుదీర్ఘకాలంగా ప్రభుత్వ ఉద్యోగిగా ప్రజలకు, శాఖకు అందించిన సేవలను ఆర్డీఓ ప్రభాకర్ కొనియాడారు. విధి నిర్వహణలో ఆయన చూపిన అంకితభావాన్ని, సహోద్యోగులతో సమన్వయంతో పనిచేసిన తీరును అభినందించారు.
అనంతరం ఆర్డీఓ ప్రభాకర్ డీఎల్‌పీఓ సురేందర్‌ను శాలువాతో సత్కరించి, జ్ఞాపికను అందజేశారు.
ఈ సన్మాన కార్యక్రమంలో ఎమ్మార్వో ప్రేమ్ కుమార్, ఎంఈఓ రాజు, ఆర్డీఓ కార్యాలయ సిబ్బంది, ఇతర డివిజన్ అధికారులు, మండల అధికారులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఈ వార్తను షేర్ చేయండి
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.