బీబీపేటలో గణపతి నిమజ్జనానికి ప్రత్యేక ఏర్పాట్లు
బీబీపేట, కామారెడ్డి జిల్లా
కామారెడ్డి జిల్లా బీబీపేట గ్రామంలో గణపతి నిమజ్జనం కార్యక్రమం ప్రశాంతంగా, సురక్షితంగా జరిగేలా గ్రామపంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టినట్లు బీబీపేట నమస్తే దినపత్రిక రిపోర్టర్ కొరవి నరసింహులు తెలిపారు.
మాంకాలమ్మ టెంపుల్ నుండి చెరువు వరకు జేసీబీ ద్వారా రహదారి మరియు పరిసరాలను శుభ్రం చేయించడం జరిగింది. నిమజ్జన మార్గంలో కొత్త విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసి వీధి దీపాలు ఏర్పాటు చేయడం జరిగింది.
ఎక్కడా అలసత్వం చోటుచేసుకోకుండా గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ పనులు పూర్తి చేయిస్తున్నారు. ప్రతి భక్తుడు, ప్రతి గ్రామ ప్రజలు నిమజ్జన కార్యక్రమంలో జాగ్రత్తలు పాటించాలని వారు కోరారు.
పిల్లలు, వృద్ధులు చెరువు పరిసరాల్లోకి ఒంటరిగా వెళ్లకుండా చూసుకోవాలని, నిమజ్జనం సమయంలో నీటి దగ్గర అత్యంత జాగ్రత్తగా ఉండాలని, ట్రాఫిక్‌కు మరియు నిమజ్జన కార్యక్రమానికి ఇబ్బంది కలగకుండా అందరూ సహకరించాలని సూచించారు. శాంతియుతంగా, భక్తిశ్రద్ధలతో గణపతి నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించుకుందామని వారు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ సాత్విక సాయినాథ్, ఉప సర్పంచ్ ప్రశాంత్, వార్డ్ మెంబర్ మహమ్మద్ ఆసిఫ్, లతా మహేష్, గ్రామ సెక్రెటరీ రమేష్, కారోబార్ సిద్ధరాములు, గ్రామపంచాయతీ కార్మికులు పాల్గొన్నారు.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.