శ్రీ భూ లక్ష్మీ విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవంలో పాల్గొన్న డా. ఏ. చంద్రశేఖర్
జహీరాబాద్ పట్టణం: జహీరాబాద్ పట్టణంలోని రామ్‌నగర్‌లో నిర్వహించిన శ్రీ భూ లక్ష్మీ విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవంలో మాజీ మంత్రి, జహీరాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ డా. ఏ. చంద్రశేఖర్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని, ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు.
భక్తిశ్రద్ధలతో నిర్వహించిన ఈ విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగింది.
ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ రామలింగారెడ్డి, మండల అధ్యక్షులు హుగ్గేల్లి రాములు, పవన్ రాథోడ్, పట్టణ అధ్యక్షులు నరేష్ గౌడ్, మాజీ పట్టణ కండేం. నర్సింసులు, సర్పంచులు ప్రేమ్ రాథోడ్, రాజ్ కుమార్, ఏ.ఎం.సి. డైరెక్టర్ శేఖర్, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.