ఎల్లారెడ్డిలో 3డీ డిజైన్ ఫాల్కాన్ ఇన్ఫ్రా నూతన శాఖ

ఎమ్మెల్యే మదన్ మోహన్ రావును కలిసిన సంస్థ ప్రతినిధులు

ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ మదన్ మోహన్ రావును వారి నివాస గృహంలో ‘3డీ డిజైన్ ఫాల్కాన్ ఇన్ఫ్రా కన్సల్టింగ్ ఇంజనీర్స్’ సంస్థ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు.

ఇప్పటికే హైదరాబాద్, మెదక్ శాఖల ద్వారా విజయవంతంగా సేవలు అందిస్తున్న తమ సంస్థ ఆధ్వర్యంలో ఎల్లారెడ్డిలో ఏర్పాటు చేయనున్న మూడవ నూతన శాఖ ప్రారంభోత్సవానికి సంబంధించిన ఆహ్వాన పత్రాన్ని ఎమ్మెల్యే మదన్ మోహన్ రావుకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆశీస్సులు తీసుకున్నారు.

త్వరలో ప్రారంభం కానున్న ఎల్లారెడ్డి నూతన శాఖ ద్వారా ప్రజలకు మరింత మెరుగైన ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్, కన్సల్టింగ్ సేవలు అందించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు.

యువ ఇంజనీర్లను ప్రోత్సహిస్తూ, సమర్థవంతమైన ప్రజా సేవకు ప్రాధాన్యత ఇస్తున్న ఎమ్మెల్యే మదన్ మోహన్ రావుకు సంస్థ ప్రతినిధులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

ఎల్లారెడ్డిలో నూతన శాఖ ఏర్పాటు ద్వారా స్థానికంగా ఇంజనీరింగ్, నిర్మాణ రంగానికి సంబంధించిన సేవలు మరింత అందుబాటులోకి వస్తాయని సంస్థ ప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేశారు.

🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్ ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా

133.33 గజాల స్థలం అమ్మకానికి!

📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్ ✓ నివాసానికి అనుకూలం ✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త

మా తాజా వార్తలను మిస్ కాకండి!

తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.

Yaswanth Pavahar
Yaswanth Pavahar పవార్ వార్త • సైట్ అడ్మిన్ Journalist and Executive Editor at Telangana Pawar Dainapatrika, focused on responsible journalism, public-interest reporting, and highlighting local issues across Telangana.

Leave a Reply