ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి మండలానికి చెందిన అంబేద్కర్ యువ సంఘం, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం, ఎస్సీ–ఎస్టీ ఉపాధ్యాయ సంఘం సభ్యులు సమావేశమై మహనీయుల విగ్రహాల ఏర్పాటుపై చర్చించారు.
చర్చలో భాగంగా ఎల్లారెడ్డిలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాన్ని మధ్యలో ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.
ఇవి కూడా చదవండి
అదే విధంగా గౌతమ బుద్ధుడు, మహాత్మ జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే, సేవాలాల్ మహారాజ్, ఏపీజే అబ్దుల్ కలాం తదితర మహనీయుల విగ్రహాలను కూడా ఎల్లారెడ్డిలో ఏర్పాటు చేయాలని సభ్యులు చర్చించినట్లు తెలిపారు.
ఈ అంశంపై ఆయా సంఘాల సభ్యులు చర్చించి నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
డౌన్‌లోడ్న్యూస్ పేపర్ క్లిప్పింగ్ • హై క్వాలిటీ














