మెల్లకుంట తండా అభివృద్ధికి ప్రత్యేక దృష్టి పెట్టాలి

ఎమ్మెల్యే కె. మోహన్‌రావును కలిసిన రామావత్ ప్రేమ్‌కుమార్

హైదరాబాద్: మెల్లకుంట తండా గ్రామంలోని పలు అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే శ్రీ కె. మోహన్‌రావును హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో రామావత్ ప్రేమ్‌కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గ్రామంలో నెలకొన్న సమస్యలు, చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు.

మెల్లకుంట తండా గ్రామంపై ప్రత్యేక దృష్టి సారించి, గ్రామంలో ‘మ్యాజిక్ డ్రైనేజీ సిస్టమ్’ను ఏర్పాటు చేసి, ఈ కార్యక్రమాన్ని తమ గ్రామం నుంచే ప్రారంభించాలని ఎమ్మెల్యేను కోరారు.

అలాగే గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి అవసరమైన ప్రత్యేక గ్రాంట్‌ను త్వరితగతిన మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. గ్రామ అభివృద్ధికి సంబంధించిన సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా, సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.

తమకు సమయం కేటాయించి గ్రామ సమస్యలను ఓపికగా విన్న ఎమ్మెల్యే శ్రీ కె. మోహన్‌రావుకు రామావత్ ప్రేమ్‌కుమార్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మెల్లకుంట తండా అభివృద్ధికి ఎమ్మెల్యే సహకారం అందిస్తారనే ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇట్లు
రామావత్ ప్రేమ్‌కుమార్

🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్ ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా

133.33 గజాల స్థలం అమ్మకానికి!

📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్ ✓ నివాసానికి అనుకూలం ✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త

మా తాజా వార్తలను మిస్ కాకండి!

తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.

Yaswanth Pavahar
Yaswanth Pavahar పవార్ వార్త • సైట్ అడ్మిన్ Journalist and Executive Editor at Telangana Pawar Dainapatrika, focused on responsible journalism, public-interest reporting, and highlighting local issues across Telangana.

Leave a Reply