రూ.10.48 లక్షలతో పోచమ్మ దేవాలయాల అభివృద్ధి పనులు పూర్తి

📍 మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా | మల్కాజిగిరి నియోజకవర్గం | యాప్రాల్ డివిజన్

మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా మల్కాజిగిరి నియోజకవర్గంలోని యాప్రాల్ డివిజన్ పరిధిలోని
కౌకూర్ భార్షాపేట్, భారత్ నగర్ పోచమ్మ దేవాలయాల అభివృద్ధి పనులు
రూ.10.48 లక్షల వ్యయంతో పూర్తయ్యాయి. మాజీ ఎమ్మెల్యే
మైనంపల్లి హనుమంతరావు ప్రత్యేక చొరవతో చేపట్టిన ఈ పనులు
బోనాల మహోత్సవాల నాటికి పూర్తి కావడంతో స్థానిక భక్తులు, కాంగ్రెస్ నాయకులు ఆనందం వ్యక్తం చేశారు.

దేవాలయాల పరిసరాల్లో భక్తులు సౌకర్యవంతంగా దర్శనం చేసుకునేందుకు
సీసీ కాంక్రీట్ బెడ్, సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టి వేగంగా పూర్తి చేశారు.
దీంతో వర్షాకాలంలో భక్తులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తొలగనున్నాయని స్థానికులు తెలిపారు.

గతంలో కూడా పోచమ్మ దేవాలయాల నిర్మాణానికి తన సొంత నిధులతో సహకారం అందించిన
మైనంపల్లి హనుమంతరావు మరోసారి దేవాలయాల అభివృద్ధికి ముందుకు రావడంతో
కాంగ్రెస్ నాయకులు, బస్తీ వాసులు ఆయనకు పాలాభిషేకం నిర్వహించి కృతజ్ఞతలు తెలిపారు.

భార్షాపేట్ యువకులు అభివృద్ధి పనుల కోసం
మల్కాజిగిరి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, సామాజిక కార్యకర్త
తుడిమెళ్ల మల్లికార్జున్ను సంప్రదించగా,
ఆయన వెంటనే మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుతో మాట్లాడి
సంబంధిత అధికారులతో సమన్వయం చేసి పనులు మంజూరై త్వరితగతిన పూర్తయ్యేలా కృషి చేసినట్లు తెలిపారు.

“కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజా సమస్యల పరిష్కారం, దేవాలయాల అభివృద్ధి,
ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉంటుంది. మైనంపల్లి హనుమంతరావు ప్రజల కోసం
నిరంతరం పనిచేసే ప్రజానాయకుడు.”
— తుడిమెళ్ల మల్లికార్జున్

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు
శివరాజ్, బొడ్డు శ్రీనివాస్ యాదవ్, శ్రావణ్,
గోమారం అంజిరెడ్డి, అల్లి మల్లేష్,
ఎన్ను వెంకట్ రెడ్డి, అల్లి పండు,
ఆసిఫుల్లా ఖాన్, అల్లి సత్యనారాయణ,
సయ్యద్ అస్లాం, రజనీకాంత్, తివారి,
సుభేదార్ యాదవ్, ఖలీల్,
మోహన్ రావు, జయంత్,
శ్రీకాంత్, శామ్యూల్,
ప్రవీణ్, భరత్, రాజ్‌కుమార్
తో పాటు భార్షాపేట్, భారత్ నగర్ బస్తీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్ ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా

133.33 గజాల స్థలం అమ్మకానికి!

📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్ ✓ నివాసానికి అనుకూలం ✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త

మా తాజా వార్తలను మిస్ కాకండి!

తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.

Yaswanth Pavahar
Yaswanth Pavahar పవార్ వార్త • సైట్ అడ్మిన్ Journalist and Executive Editor at Telangana Pawar Dainapatrika, focused on responsible journalism, public-interest reporting, and highlighting local issues across Telangana.

Leave a Reply