కంటైనర్‌ను ఢీకొట్టిన అడిషనల్ కలెక్టర్ కారు.. సురక్షితంగా బయటపడిన వేణుగోపాల్
నార్కట్‌పల్లి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అడిషనల్ కలెక్టర్ వేణుగోపాల్ ప్రయాణిస్తున్న కారు ఆదివారం రోడ్డు ప్రమాదానికి గురైంది. హైదరాబాద్ నుంచి కొత్తగూడెం వెళ్తుండగా నార్కట్‌పల్లి సమీపంలోని కామినేని ఆస్పత్రి వద్ద ఫ్లైఓవర్‌పై ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో కారు ముందు భాగం దెబ్బతినగా, వేణుగోపాల్ సురక్షితంగా బయటపడ్డారు.
యూటర్న్ తీసుకుంటున్న కంటైనర్‌ను ఢీకొట్టిన కారు
ఫ్లైఓవర్‌పై ముందుగా వెళ్తున్న కంటైనర్ యూటర్న్ తీసుకుంటున్న సమయంలో వేణుగోపాల్ ప్రయాణిస్తున్న కారు వెనుక నుంచి దాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం దెబ్బతింది. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
మరో వాహనంలో కొత్తగూడెంకు ప్రయాణం
ప్రమాదంలో దెబ్బతిన్న కారును ఇన్సూరెన్స్ ప్రక్రియ కోసం అక్కడే ఉంచారు. అనంతరం పోలీసులు అడిషనల్ కలెక్టర్ వేణుగోపాల్‌కు అల్పాహారం ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఆయన సివిల్ సప్లైస్ అధికారి కారులో కొత్తగూడెం బయలుదేరి వెళ్లారు.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.