భవన నిర్మాణ కార్మికులకు రూ.5 వేల పెన్షన్ ఇవ్వాలి.. 29న లేబర్ కమిషనర్‌కు వినతి

కామారెడ్డి: భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 29న హైదరాబాద్‌లోని కార్మిక అంజయ్య భవన్‌లో లేబర్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేయనున్నట్లు భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం (BNRKS) కామారెడ్డి జిల్లా ఇన్‌చార్జి మహామేస్త్రి మర్లు సాయిబాబు తెలిపారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దరిపల్లి చంద్రం ఆదేశాల మేరకు మంగళవారం ఉదయం 11 గంటలకు ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

55 ఏళ్లు నిండిన కార్మికులకు రూ.5 వేల పెన్షన్ ఇవ్వాలి

55 సంవత్సరాలు నిండిన అర్హులైన ప్రతి భవన నిర్మాణ కార్మికుడికి నెలకు రూ.5,000 పెన్షన్ అందించాలని మర్లు సాయిబాబు డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని ప్రతి ఉమ్మడి జిల్లాలో ఈఎస్‌ఐ ఆసుపత్రి సౌకర్యం ఏర్పాటు చేయాలని కోరారు.

కార్మికుడు జీవించి ఉన్నంతకాలం లేబర్ కార్డు కొనసాగించాలని, నకిలీ లేబర్ కార్డులను తొలగించి అర్హులైన నిజమైన కార్మికులకు సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్‌గా నిజమైన కార్మికుడినే నియమించాలని డిమాండ్ చేశారు.

కార్మికులు అధిక సంఖ్యలో తరలిరావాలి

కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొనాలని మర్లు సాయిబాబు పిలుపునిచ్చారు.

జిల్లా, డివిజన్, మండల, పట్టణ, గ్రామ స్థాయిల్లో పనిచేస్తున్న కార్మికులు సెప్టెంబర్ 29న హైదరాబాద్‌లోని కార్మిక అంజయ్య భవన్‌కు తరలివచ్చి లేబర్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేసే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

ఈ వార్తను షేర్ చేయండి

🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్ ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా

133.33 గజాల స్థలం అమ్మకానికి!

📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్ ✓ నివాసానికి అనుకూలం ✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త

మా తాజా వార్తలను మిస్ కాకండి!

తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.

Yaswanth Pavahar
Yaswanth Pavahar పవార్ వార్త • సైట్ అడ్మిన్ Journalist and Executive Editor at Telangana Pawar Dainapatrika, focused on responsible journalism, public-interest reporting, and highlighting local issues across Telangana.

Leave a Reply