బాన్సువాడలో వికలాంగ కుటుంబాలకు సహాయక పరికరాలు.. పోచారం భాస్కర్ రెడ్డి సాయం

కామారెడ్డి జిల్లా బాన్సువాడ అంబేద్కర్ చౌరస్తాలో జరిగిన బహిరంగ సభలో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ సలహాదారు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి, మాజీ డీసీసీబీ అధ్యక్షుడు పోచారం భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బాన్సువాడ పట్టణానికి చెందిన యాదగిరి, కరణ్, మహమ్మద్ కుటుంబాలకు పోచారం భాస్కర్ రెడ్డి అండగా నిలిచారు. అంగవైకల్యంతో బాధపడుతున్న వారి కోసం తన సొంత ఖర్చులతో కృత్రిమ చేయి, కాళ్లు వంటి ఖరీదైన సహాయక పరికరాలను అందించారు.

అనంతరం పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ సభ రాజకీయాలకు అతీతంగా జరుగుతున్న సభ అని అన్నారు. బాన్సువాడ నియోజకవర్గంలోని అంగవైకల్యం ఉన్నవారిని గుర్తించి, అవసరమైన సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

అవసరమైతే ఎన్ని కోట్ల నిధులైనా వెచ్చించి లండన్ నుంచి పరికరాలు తెప్పించి ఆపరేషన్లు చేయిస్తామని ఆయన పేర్కొన్నారు. నియోజకవర్గంలోని వికలాంగులను గుర్తించి తమ వద్దకు పంపించాలని నాయకులను కోరారు.

తాము చేస్తున్న సహాయం ఓట్ల కోసం, రాజకీయాల కోసం కాదని, కష్టాల్లో ఉన్నవారిని మానవతా దృక్పథంతో ఆదుకోవడమే తమ ధర్మమని పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

వార్తను షేర్ చేయండి
🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్ ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా

133.33 గజాల స్థలం అమ్మకానికి!

📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్ ✓ నివాసానికి అనుకూలం ✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త

మా తాజా వార్తలను మిస్ కాకండి!

తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.

Yaswanth Pavahar
Yaswanth Pavahar పవార్ వార్త • సైట్ అడ్మిన్ Journalist and Executive Editor at Telangana Pawar Dainapatrika, focused on responsible journalism, public-interest reporting, and highlighting local issues across Telangana.

Leave a Reply