లింగంపేట్ మండల మహిళా అధ్యక్షురాలిగా కమ్మరి సావిత్రి నియామకం
లింగంపేట్ మండల మహిళా అధ్యక్షురాలిగా బోనాల్ గ్రామానికి చెందిన కమ్మరి సావిత్రిని నియమించినట్లు మండల అధ్యక్షుడు పోకల సాయిరాం తెలిపారు.
తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆదేశాల మేరకు, ఎల్లారెడ్డి నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి ఎదురుగట్ల సంపత్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ నియామకం జరిగినట్లు ఆయన పేర్కొన్నారు.
ఈ సందర్భంగా పార్టీ నాయకులు కమ్మరి సావిత్రికి అభినందనలు తెలిపారు.
కార్యక్రమంలో మండల యూత్ అధ్యక్షుడు మోహన్ రెడ్డి, జిల్లా నాయకులు ప్రతాప్ రెడ్డి, జైల్ సింగ్, మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు బ్యాగరీ సాయిలు తదితరులు పాల్గొన్నారు.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.