రెండో పంటపై రైతులు అప్రమత్తంగా ఉండాలి: పోచారం
కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బుడిమి రైతు సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో ఎల్‌నినో ప్రభావంతో రెండో వరి పంట సాగులో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని రైతులను అప్రమత్తం చేశారు.
ఎల్‌నినో ప్రభావం నాలుగు సంవత్సరాలు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రాజెక్టుల్లో నీటి లభ్యత తగ్గే అవకాశం ఉండటంతో పాటు విద్యుత్ కొరత ఏర్పడే పరిస్థితులు కూడా ఉండవచ్చని తెలిపారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రెండో పంట సాగుపై రైతులు జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలని సూచించారు.
రెండో పంట సాగుకు ముందే నీటి లభ్యత, విద్యుత్ పరిస్థితులను అంచనా వేసుకుని పంటల సాగుపై ప్రణాళిక రూపొందించుకోవాలని పోచారం శ్రీనివాస్ రెడ్డి రైతులకు సూచించారు.
ఇదే సందర్భంగా కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియను సజావుగా నిర్వహించాలని సంబంధిత సిబ్బందికి ఆయన సూచించారు.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.