ఈ నెల 20న హైదరాబాద్‌లో ‘బీసీ కలాల అలాయ్ బలాయ్’ కార్యక్రమం

హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఈ నెల 20న ఉదయం 10 గంటలకు ‘బీసీ కలాల అలాయ్ బలాయ్’ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా తొలి బీసీ కవితా సంకలనం ‘వెంటాడే కళాలు – వెనుకబడిన కులాలు’ ప్రచురణకు 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రజతోత్సవ సభ నిర్వహించనున్నారు.

చేతివృత్తుల జీవితాల్లో, వృత్తుల్లో తలెత్తుతున్న సమస్యలు, సంక్షోభాలను చిత్రించిన ఈ కవితా సంకలనం 2001లో ప్రచురించబడిందని నిర్వాహకులు తెలిపారు. ఈ ఏడాదికి గ్రంథం ప్రచురణకు 25 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో రజతోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను ఎల్లారెడ్డిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఈ. లక్ష్మీనారాయణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేతివృత్తుల సాహిత్యాన్ని సృష్టించడం, పరిరక్షించుకోవడం అందరి బాధ్యత అని అన్నారు.

కరపత్రాల ఆవిష్కరణ కార్యక్రమంలో అధ్యాపకులు డాక్టర్ వి. శంకరయ్య, డాక్టర్ ఎం. చంద్రకాంత్, జంగం శివకుమార్, డాక్టర్ జి. సిద్ధురాజు, కృష్ణ ప్రసాద్, సురేశ్ రెడ్డి, లక్ష్మణ్, నరేశ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

ఈ వార్తను షేర్ చేయండి

🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్ ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా

133.33 గజాల స్థలం అమ్మకానికి!

📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్ ✓ నివాసానికి అనుకూలం ✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త

మా తాజా వార్తలను మిస్ కాకండి!

తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.

Yaswanth Pavahar
Yaswanth Pavahar పవార్ వార్త • సైట్ అడ్మిన్ Journalist and Executive Editor at Telangana Pawar Dainapatrika, focused on responsible journalism, public-interest reporting, and highlighting local issues across Telangana.

Leave a Reply