భిక్కనూరు మండలంలో ప్రభుత్వ మందులు రోడ్డుపక్కన.. ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
కామారెడ్డి జిల్లా: భిక్కనూరు మండలంలోని రామేశ్వర్ పల్లి గ్రామ శివారులో జాతీయ రహదారి-44 పక్కన ప్రభుత్వం సరఫరా చేసే మందులు భారీ మొత్తంలో లభ్యమైనట్లు సమాచారం. సుమారు రూ.15 లక్షల విలువైన మందులను మినీ డీసీఎం వ్యాన్‌లో తరలించి రోడ్డుపక్కన పారబోస్తుండగా భిక్కనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది గుర్తించి పట్టుకున్నట్లు సమాచారం.
భిక్కనూరు మండలం బస్వాపూర్ గ్రామ శివారుతో పాటు భిక్కనూరు మండల కేంద్రం, రామేశ్వర్ పల్లి గ్రామ శివారులో గత కొంతకాలంగా కొంతమంది వ్యక్తులు మందులు పారబోస్తున్నట్లు సమాచారం అందినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మందులను పారబోస్తున్న సమయంలో భిక్కనూరు పీహెచ్‌సీ సిబ్బంది వారిని పట్టుకున్నట్లు పేర్కొన్నారు.
స్వాధీనం చేసుకున్న మందులకు కాలపరిమితి ఉన్నట్లు అందిన సమాచారంలో పేర్కొన్నారు. పట్టుబడిన మందుల మొత్తం విలువ సుమారు రూ.15 లక్షలుగా సమాచారం.
భిక్కనూరు మెడికల్ ఆఫీసర్ యేమిమా పోలీసులకు సమాచారం అందించినట్లు సమాచారం. దీంతో మందులను తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులతో పాటు మినీ డీసీఎం వ్యాన్‌ను భిక్కనూరు పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు తెలుస్తోంది. ఇద్దరిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం.
ప్రభుత్వం సరఫరా చేసే కాలపరిమితి ఉన్న మందులు గత కొంతకాలంగా రోడ్లపై పడేస్తున్నారనే సమాచారంతో ఈ వ్యవహారంపై జిల్లా ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. మందులను ఎందుకు తరలించారు, రోడ్డుపక్కన ఎందుకు పారబోశారు అనే అంశాలు పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.