భూర్గుల్‌లో రూ.10 లక్షల SHG భవనానికి శంకుస్థాపన

గాంధారి మండలం భూర్గుల్ గ్రామంలో రూ.10 లక్షల వ్యయంతో నిర్మించనున్న మహిళా స్వయం సహాయక సంఘం (SHG) భవనానికి భూమిపూజ చేసి శంకుస్థాపన చేశారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కృషితో ఈ భవనం నిర్మాణం చేపడుతున్నట్లు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం తెలిపింది.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ మాట్లాడుతూ గ్రామీణ మహిళల ఆర్థిక సాధికారత, స్వయం ఉపాధి అవకాశాల పెంపు, మహిళా సంఘాల బలోపేతానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. మహిళా సంఘాల కార్యకలాపాలు మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ఈ భవనం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

సమావేశాలు, శిక్షణ కార్యక్రమాలు, పొదుపు సంఘాల నిర్వహణకు ఈ భవనం కేంద్రంగా నిలుస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. ప్రతి గ్రామంలో అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తూ అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా గ్రామస్తులు, మహిళా సంఘాల సభ్యులు ఎమ్మెల్యే మదన్ మోహన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

కార్యక్రమంలో ఉప సర్పంచ్, మహిళా సంఘాల సభ్యులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

ఈ వార్తను షేర్ చేయండి

🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్ ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా

133.33 గజాల స్థలం అమ్మకానికి!

📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్ ✓ నివాసానికి అనుకూలం ✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త

మా తాజా వార్తలను మిస్ కాకండి!

తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.

Yaswanth Pavahar
Yaswanth Pavahar పవార్ వార్త • సైట్ అడ్మిన్ Journalist and Executive Editor at Telangana Pawar Dainapatrika, focused on responsible journalism, public-interest reporting, and highlighting local issues across Telangana.

Leave a Reply