ఎల్లారెడ్డి 1వ వార్డులో ఓటరు నమోదుపై అవగాహన కార్యక్రమం
ఎల్లారెడ్డి పట్టణంలోని 1వ వార్డులో నూతన ఓటర్ల నమోదు, ఓటరు జాబితాలో వివరాల సవరణపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు సెప్టెంబర్ 9న ప్రత్యేక ప్రచార కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా 18 సంవత్సరాలు నిండిన అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు. ఓటరు జాబితాలో పేరు లేని వారు, పేర్లు లేదా ఇతర వివరాల్లో తప్పులు ఉన్న వారు అవసరమైన సవరణలు చేసుకోవాలని తెలిపారు.
అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని, ప్రజల్లో ఓటు హక్కుపై మరింత అవగాహన పెంచడమే కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని అధికారులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జాగ్జీవన్ తో పాటు అధికారులు, సిబ్బంది, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.