బీబీపేట వేణుగోపాల స్వామి ఆలయంలో రేపు శ్రీకృష్ణుడి తొట్టెల మహోత్సవం
కామారెడ్డి జిల్లా | బీబీపేట
శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని కామారెడ్డి జిల్లా బీబీపేటలోని వేణుగోపాల స్వామి ఆలయంలో రేపు శ్రీకృష్ణుడి తొట్టెల మహోత్సవాన్ని నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది.
జన్మాష్టమి సందర్భంగా నిర్వహించనున్న ఈ తొట్టెల మహోత్సవానికి బీబీపేట గ్రామ ప్రజలతో పాటు పరిసర ప్రాంతాల భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై వేడుకలను తిలకించాలని ఆలయ కమిటీ కోరింది.
భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్న శ్రీకృష్ణుడి తొట్టెల మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు భక్తులు, గ్రామ ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కమిటీ విజ్ఞప్తి చేసింది.
ఈ మేరకు ఆలయ కమిటీ తాజా మాజీ కొరివి నీరజ నర్సింలు గ్రామ ప్రజలకు, పరిసర ప్రాంతాల భక్తులకు ఆహ్వానం పలికారు.