తృటిలో తప్పిన ప్రమాదం.. అందరూ క్షేమం

చింతపల్లి గ్రామం మార్గమధ్యలో స్వల్ప అగ్ని ప్రమాదానికి గురైన వాహనం
చింతపల్లి గ్రామం మార్గమధ్యలో వాహనంలో చోటుచేసుకున్న స్వల్ప అగ్ని ప్రమాద దృశ్యాలు.

ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా కలెక్టర్ కార్యాలయానికి బయలుదేరిన ప్రభుత్వ విప్, డోర్నకల్ శాసనసభ్యులు డాక్టర్ జాటోత్ రాంచందర్ నాయక్, జిల్లా యువజన నాయకులు నూకల అభినవ్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, గన్‌మెన్లు, నాయకులు ప్రయాణిస్తున్న వాహనం చింతపల్లి గ్రామం మార్గమధ్యలో స్వల్ప అగ్ని ప్రమాదానికి గురైంది.

పవర్ బ్యాంక్ పేలడంతో మంటలు

డ్రైవర్ పక్కన ఉన్న ఫోన్ పవర్ బ్యాంక్ ఒక్కసారిగా పేలడంతో వాహనంలో స్వల్పంగా మంటలు చెలరేగినట్లు సమాచారం. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.

అందరూ క్షేమం

ఈ ఘటనలో ఎలాంటి ప్రాణహాని జరగలేదు. ప్రభుత్వ విప్ డాక్టర్ జాటోత్ రాంచందర్ నాయక్‌తో పాటు వాహనంలో ప్రయాణిస్తున్న వారందరూ క్షేమంగా ఉన్నారు.

సిబ్బంది అప్రమత్తతతో ప్రమాదం తృటిలో తప్పినట్లు సమాచారం.

ఈ వార్తను షేర్ చేయండి: WhatsApp Facebook X
🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్ ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా

133.33 గజాల స్థలం అమ్మకానికి!

📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్ ✓ నివాసానికి అనుకూలం ✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త

మా తాజా వార్తలను మిస్ కాకండి!

తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.

Yaswanth Pavahar
Yaswanth Pavahar పవార్ వార్త • సైట్ అడ్మిన్ Journalist and Executive Editor at Telangana Pawar Dainapatrika, focused on responsible journalism, public-interest reporting, and highlighting local issues across Telangana.

Leave a Reply