ఎల్లారెడ్డిలో తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా బీజేపీ జాతీయ జెండా ఆవిష్కరణ
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. పట్టణ అధ్యక్షులు అగల్ దివిటీ రాజేష్ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకులు మర్రి బాలకిషన్, జిల్లా ఉపాధ్యక్షులు దేవేందర్ మాట్లాడారు. తెలంగాణ విమోచన దినోత్సవ చారిత్రక ప్రాధాన్యతను గుర్తు చేసుకుంటూ, తెలంగాణ కోసం పోరాడిన వీరుల త్యాగాలను స్మరించుకున్నారు.
అధికారికంగా వేడుకలు నిర్వహించాలని డిమాండ్
దేశ ఐక్యత, సమగ్రత, ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.
తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే బీజేపీ తరఫున పోరాటాలకు సిద్ధమని పిలుపునిచ్చినట్లు తెలిపారు.
కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు
ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షులు సతీష్, లక్ష్మీనారాయణ, పట్టణ ప్రధాన కార్యదర్శి శ్రీను, సీనియర్ నాయకులు కాశినాథ్, సత్యం, కార్యదర్శి శివ, కోశాధికారి గజనన్, దళిత మోర్చా నాయకులు పండరి, యువ నాయకులు రమేష్ పాల్గొన్నారు.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.