దేవరకద్రలో మూడు హై లెవెల్ వంతెనలకు రూ.10.60 కోట్ల నిధులు

దేవరకద్ర నియోజకవర్గంలో మూడు కీలక హై లెవెల్ వంతెనల నిర్మాణానికి మొత్తం రూ.10.60 కోట్ల నిధులు మంజూరైనట్లు కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం తెలిపింది. ఈ నిధులు మంజూరు కావడంతో ఆయా గ్రామాల ప్రజలు ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డిని కలిసిన స్థానిక నాయకులు, గ్రామస్తులు
ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డిని కలిసిన స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు

చిన్నచింతకుంట మండలం దమగ్నాపూర్ గ్రామంలో దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డిని ఆయన నివాసంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, ఆయా గ్రామాల ప్రజలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం తమ గ్రామాల ప్రజల చిరకాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మూడు హై లెవెల్ వంతెనల నిర్మాణానికి నిధులు మంజూరు చేసినందుకు ఎమ్మెల్యేకు ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసినట్లు కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం పేర్కొంది.

మూడు వంతెనలకు రూ.10.60 కోట్ల నిధులు

  • పోతులమడుగు – గోపన్నపల్లె మార్గంలో హై లెవెల్ వంతెన నిర్మాణానికి రూ.4 కోట్లు.
  • చిన్న వడ్డేమాన్ – ఉంద్యాల మార్గంలో హై లెవెల్ వంతెన నిర్మాణానికి రూ.3 కోట్లు.
  • ఫర్దిపూర్ మెయిన్ రోడ్ – గోప్య నాయక్ తండా మార్గంలో హై లెవెల్ వంతెన నిర్మాణానికి రూ.3 కోట్ల 60 లక్షలు.

మూడు వంతెనల నిర్మాణానికి కలిపి రూ.10 కోట్ల 60 లక్షల నిధులు మంజూరు కావడంతో ఆయా గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేసినట్లు కాంగ్రెస్ పార్టీ తెలిపింది.

ఈ వంతెనల నిర్మాణంతో వర్షాకాలంలో రాకపోకలకు ఎదురయ్యే ఇబ్బందులు తొలగడంతో పాటు గ్రామాల మధ్య రవాణా సౌకర్యం మెరుగుపడుతుందని గ్రామస్తులు తెలిపినట్లు పేర్కొంది. ప్రజలు, రైతులు, విద్యార్థులకు ఈ వంతెనలు ప్రయోజనం చేకూరుస్తాయని గ్రామస్తులు అభిప్రాయపడినట్లు తెలిపింది.

ప్రజల అవసరాలను గుర్తించి అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయిస్తున్న ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డికి స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు కృతజ్ఞతలు తెలియజేసి సన్మానించినట్లు కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం పేర్కొంది.

దేవరకద్ర నియోజకవర్గానికి చెందిన స్థానిక నాయకులు, గ్రామస్తులు

అప్పంపల్లి మీదుగా కురుమూర్తికి డబుల్ రోడ్డు

అదేవిధంగా కౌకుంట్ల మండలం అప్పంపల్లి గ్రామస్తులు కూడా తమ ప్రాంతానికి సంబంధించిన రహదారి పనులకు మంజూరు లభించినందుకు ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపినట్లు కాంగ్రెస్ పార్టీ పేర్కొంది.

మినీగోనిపల్లి నుంచి అప్పంపల్లి మీదుగా కురుమూర్తి దేవస్థానం వరకు డబుల్ రోడ్డు మంజూరు చేసినందుకు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపినట్లు వెల్లడించింది.

ఈ వార్తను షేర్ చేయండి

ఈ వార్తను షేర్ చేయండి

🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్ ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా

133.33 గజాల స్థలం అమ్మకానికి!

📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్ ✓ నివాసానికి అనుకూలం ✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త

మా తాజా వార్తలను మిస్ కాకండి!

తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.

Yaswanth Pavahar
Yaswanth Pavahar పవార్ వార్త • సైట్ అడ్మిన్ Journalist and Executive Editor at Telangana Pawar Dainapatrika, focused on responsible journalism, public-interest reporting, and highlighting local issues across Telangana.

Leave a Reply