నిజాంసాగర్ ప్రాజెక్ట్‌లో యువకుడు గల్లంతు.. మత్స్యకారుడి సాహసంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు
కామారెడ్డి జిల్లా, నిజాంసాగర్:
నిజాంసాగర్ ప్రాజెక్ట్ 12 గేట్ల వద్ద స్నానానికి దిగిన 18 ఏళ్ల యువకుడు నీటిలో గల్లంతయ్యాడు. చేపలు పట్టేందుకు వచ్చిన ఓ మత్స్యకారుడు వెంటనే నీటిలోకి దూకి యువకుడిని బయటకు తీసుకురావడంతో అతడిని రక్షించగలిగారు.
బాన్సువాడ కోట్‌గల్లీకి చెందిన 18 ఏళ్ల ముజాకీర్ తన స్నేహితులు అమ్మన్, నాగార్జున్‌తో కలిసి నిజాంసాగర్ ప్రాజెక్ట్‌ను చూడటానికి వచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలో ప్రాజెక్ట్ 12 గేట్ల వద్ద ముజాకీర్ స్నానానికి దిగగా నీటిలో గల్లంతయ్యాడు.
అదే సమయంలో చేపలు పట్టేందుకు వచ్చిన సయ్యద్ సయీద్ ఒద్దిన్ నీటిలోకి దూకి ముజాకీర్‌ను బయటకు తీసుకొచ్చాడు.
అనంతరం స్థానికుల సహకారంతో ముజాకీర్‌కు సీపీఆర్ చేసినట్లు సమాచారం. దీంతో అతడు ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.