ఏకదంతా వినాయక అసోసియేషన్ ఆధ్వర్యంలో మహా అన్నదానం
ఉప్పల్/మల్లాపూర్ పరిధిలో ఏకదంతా వినాయక అసోసియేషన్ ఆధ్వర్యంలో, అధ్యక్షులు అచ్చగొని దినేష్ గౌడ్ నేతృత్వంలో వినాయక చవితి వేడుకలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా వినాయకుని మండపం ప్రాంగణంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
తొలి రోజు నుంచే స్వామివారికి ప్రత్యేక పూజలు, రుద్రాభిషేకాలు, సహస్ర నామార్చనలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రతిరోజూ వేకువజాము నుంచే మండపం వద్ద వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ ధూపదీప నైవేద్యాలు సమర్పిస్తున్నారు.
మహా అన్నదాన కార్యక్రమానికి మల్లాపూర్ పరిసర ప్రాంతాల నుంచి భక్తులు, స్థానిక ప్రజలు విశేష సంఖ్యలో తరలివచ్చారు. గణనాథుడిని దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. మండపం వద్ద ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలు, పుష్పాల అలంకరణలు భక్తులను ఆకట్టుకున్నాయి.
కార్యక్రమానికి పలువురు స్థానిక నాయకులు, ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు స్వయంగా ప్రసాదాన్ని పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు అచ్చగొని దినేష్ గౌడ్ మాట్లాడుతూ.. లంబోదరుని దివ్య ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నామని తెలిపారు. భక్తులందరూ కలసికట్టుగా వచ్చి వేడుకలను విజయవంతం చేయడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.
మండప ప్రాంగణం భక్తుల జయజయధ్వానాలు, ఆధ్యాత్మిక గీతాలతో మారుమోగుతోంది. మహిళలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తూ వేడుకల్లో పాల్గొన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిర్వాహకులు ఏర్పాట్లు చేపట్టారు.
ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు అచ్చగొని దినేష్ గౌడ్‌తో పాటు కమిటీ సభ్యులు భరత్, సందీప్, చరణ్, పృథ్వి, నీలేష్, సునీల్, ఆశిష్, అంచల్, వెంకటేష్, లక్కీలతో పాటు పలువురు కమిటీ సభ్యులు, యువకులు పాల్గొన్నారు.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.