వక్రతుండ బ్రదర్స్ ఆధ్వర్యంలో ఘనంగా మహా అన్నదానం

మేడ్చల్ జిల్లా చెంగిచర్ల డివిజన్ చిన్న క్రాంతి కాలనీలో వక్రతుండ బ్రదర్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మహా అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు ముఖ్య అతిథులుగా హాజరై అన్నదానాన్ని ప్రారంభించారు.

అనంతరం ముఖ్య అతిథులు స్వయంగా భక్తులకు అన్నప్రసాదాలను వితరణ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వక్రతుండ బ్రదర్స్ సభ్యులు ప్రతి సంవత్సరం గణేష్ నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ఐకమత్యంతో నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు.

ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు సామాజిక, సేవా కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా సమాజంలో సోదరభావం పెంపొందుతుందని వారు తెలిపారు. భక్తులందరిపై విఘ్నేశ్వరుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు.

ఈ మహా అన్నదాన కార్యక్రమంలో పరిసర ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వక్రతుండ బ్రదర్స్ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

కార్యక్రమంలో వివిధ పార్టీల ప్రతినిధులు, సంఘ సేవకులు, వక్రతుండ బ్రదర్స్ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు, యువకులు, మహిళలు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

ఈ వార్తను షేర్ చేయండి
🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్ ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా

133.33 గజాల స్థలం అమ్మకానికి!

📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్ ✓ నివాసానికి అనుకూలం ✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త

మా తాజా వార్తలను మిస్ కాకండి!

తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.

Yaswanth Pavahar
Yaswanth Pavahar పవార్ వార్త • సైట్ అడ్మిన్ Journalist and Executive Editor at Telangana Pawar Dainapatrika, focused on responsible journalism, public-interest reporting, and highlighting local issues across Telangana.

Leave a Reply