సిరిసిల్ల ముదిరాజ్ సింహగర్జన సభకు అధిక సంఖ్యలో తరలిరావాలి
సెప్టెంబర్ 28న సిరిసిల్ల పట్టణంలో నిర్వహించనున్న ముదిరాజ్ సింహగర్జన సభకు ముదిరాజ్ బంధువులు అధిక సంఖ్యలో తరలిరావాలని డా. జూలు నాగేశ్వర్ ముదిరాజ్ పిలుపునిచ్చారు. శనివారం ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా సభకు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు.
కార్యక్రమానికి అధ్యక్షత వహించిన డా. జూలు నాగేశ్వర్ ముదిరాజ్ మాట్లాడుతూ.. ముదిరాజ్ సమాజం ఎదుర్కొంటున్న సమస్యలు, హక్కులు, సామాజిక అభివృద్ధికి సంబంధించిన అంశాలపై సమాజం ఐక్యంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. ఆత్మగౌరవం కోసం ప్రతి ముదిరాజ్ బిడ్డ సిరిసిల్ల సింహగర్జన సభలో పాల్గొనాలని కోరారు.
ముదిరాజ్‌లను బీసీ-డీ నుంచి బీసీ-ఏలోకి మార్చాలి
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు చొక్క రాములు ముదిరాజ్ మాట్లాడుతూ.. ముదిరాజ్‌లను బీసీ-డీ నుంచి బీసీ-ఏ వర్గంలోకి మార్చి ముదిరాజ్ బిడ్డల ఆత్మగౌరవాన్ని కాపాడాలని కోరారు. ముదిరాజ్ సమాజ హక్కుల కోసం నిర్వహిస్తున్న సిరిసిల్ల సింహగర్జన సభలో ముదిరాజ్ బంధువులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
రిజర్వేషన్, విద్య, ఉద్యోగాలు, వృత్తి, రాజకీయ హక్కులకు సంబంధించిన అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ముదిరాజ్‌లను బీసీ-ఏ వర్గంలోకి మార్చాలనే డిమాండ్‌తో పాటు 50 సంవత్సరాలు నిండిన ముదిరాజ్‌లకు పెన్షన్ అందించాలనే డిమాండ్‌ను కూడా సభ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు పేర్కొన్నారు.
పోస్టర్ ఆవిష్కరణలో పలువురు పాల్గొనగా..
పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో డా. ఇట్టబోయిన కృష్ణ కిషోర్ ముదిరాజ్, రమేష్ ముదిరాజ్, అనిత ముదిరాజ్, డా. పెబ్బేటి మల్లికార్జున్, డా. సోమ కృష్ణ ముదిరాజ్, మన్నె వెంకటేష్ ముదిరాజ్, బీసీఎఫ్ జాతీయ అధ్యక్షుడు నాగనమోని చెన్నరాములు, బీసీఎఫ్ మహిళా అధ్యక్షురాలు సీతామహాలక్ష్మి, సికింద్రాబాద్ ముదిరాజ్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు అమ్మగారి యాదగిరి, కన్వీనర్ పిట్ల హరిదాస్, కోశాధికారి గౌరి గణేశ్ తదితరులు పాల్గొన్నారు.
అలాగే చొక్క రాములు ముదిరాజ్, చొప్పరి రామచంద్రం ముదిరాజ్, జెల్ల వెంకటస్వామి ముదిరాజ్, పర్ష హన్మండ్లు ముదిరాజ్, కోడి అంతయ్య ముదిరాజ్, కారణాల భద్రాచలం ముదిరాజ్, బొజ్జ కనకయ్య ముదిరాజ్, బోయిని దేవరాజ్ ముదిరాజ్, వంకాయల కార్తీక్, లాల దేవయ్య, కునబోయిన బాలరాజు, కునబోయిన పర్ష రాములు, కంకటి ప్రభాకర్, బైరీ సతీష్, ఈగ శంకర్, ఎదుల నాగరాజు, బోడిగే దుర్గయ్య, సుద్దాల సత్తయ్య, రాయిని ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.
సెప్టెంబర్ 28న సిరిసిల్లలో సభ
సెప్టెంబర్ 28న మధ్యాహ్నం 2 గంటల నుంచి సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ముదిరాజ్ సింహగర్జన సభ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. సభకు ముదిరాజ్ సమాజానికి చెందిన యువత, మహిళలు, విద్యావంతులు, ఉద్యోగులు, సంఘాల ప్రతినిధులు, ముదిరాజ్ బంధువులు అధిక సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.