ఉప్పల్ జోన్ మౌలిక వసతుల సమస్యలపై మల్కాజిగిరి కమిషనర్‌కు వినతిపత్రం
మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఉప్పల్ జోన్ ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ మౌలిక వసతుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ మేడ్చల్ నియోజకవర్గ బీజేపీ ఇంచార్జ్ శ్రీ ఏనుగు సుదర్శన్ రెడ్డి గారు, బీజేవైఎం రాష్ట్ర నాయకులు శ్రీ పవన్ రెడ్డి గారు కలిసి మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీ వినయ్ కృష్ణారెడ్డి గారికి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఉప్పల్ జోన్ పరిధిలోని మేడిపల్లి, పీర్జాదిగూడ, బోడుప్పల్, చెంగిచెర్ల, పోచారం, ఘట్కేసర్, ఎదులాబాద్, నాగారం తదితర ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్లారు.
చాలా ప్రాంతాల్లో అధ్వానంగా ఉన్న రోడ్లు, సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం, తాగునీటి సమస్యలు, వీధి దీపాల కొరత, పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనుల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ముఖ్యంగా వర్షాకాలంలో డ్రైనేజీ సమస్యల కారణంగా ప్రజలకు ఇబ్బందులు మరింత పెరుగుతున్నాయని పేర్కొన్నారు.
ప్రజలకు అవసరమైన కనీస మౌలిక సదుపాయాలను అందించడం ప్రభుత్వ యంత్రాంగం ప్రాథమిక బాధ్యత అని పేర్కొంటూ, పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను గుర్తించి వాటికి ప్రాధాన్యత క్రమంలో నిధులు కేటాయించి, పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఏనుగు సుదర్శన్ రెడ్డి గారు కోరారు.
అదేవిధంగా పీర్జాదిగూడ డివిజన్ పరిధిలోని మేడిపల్లి చెరువు స్థలాన్ని ఆక్రమించి పార్కింగ్ కోసం అద్దెకు ఇస్తున్నారనే ఫిర్యాదులపై అధికారులు సమగ్ర విచారణ చేపట్టాలని కోరారు. చెరువులు, ప్రభుత్వ స్థలాలు మరియు ప్రజా ఆస్తుల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, ఫిర్యాదుల్లో వాస్తవం ఉన్నట్లు తేలితే బాధ్యులపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న సమస్యలను కేవలం హామీలతో కాకుండా క్షేత్రస్థాయిలో పరిశీలించి, గడువుతో కూడిన కార్యాచరణ ద్వారా పరిష్కరించాలని అధికారులను కోరారు.
ఉప్పల్ జోన్ పరిధిలోని అన్ని డివిజన్లలో మౌలిక వసతుల పరిస్థితిని సమీక్షించి, అవసరమైన అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రజలకు సురక్షితమైన మరియు మెరుగైన జీవన వాతావరణం కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఏనుగు సుదర్శన్ రెడ్డి గారు కోరారు.
ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రజల తరఫున ప్రశ్నించడం, అధికారుల దృష్టికి సమస్యలను తీసుకెళ్లడం, పరిష్కారం లభించే వరకు నిరంతరం కృషి చేయడం తమ బాధ్యత అని ఈ సందర్భంగా ఏనుగు సుదర్శన్ రెడ్డి గారు స్పష్టం చేశారు.
కొత్త అప్‌డేట్స్ కోసం మా WhatsApp ఛానెల్‌లో జాయిన్ అవ్వండి
WhatsApp ఛానెల్ జాయిన్133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.